ఇంత విషం కడుపులో దాచుకుని ఎలా కలిసుందామనుకుంటున్నారు?


పేరుకది విశాలాంధ్ర మహాసభ అయినా అదొక పచ్చి విషాంధ్ర మహాసభ అని వెనుకటికొకసారి రాశాను. వాస్తవానికి అది పట్టించుకోవలసినంత పెద్ద సంస్థ కాదు. కానీ తెలంగాణకు వ్యతిరేకంగా నడుస్తున్న గుంపు కాబట్టి మన సీమాంధ్ర మీడియా దాని స్థాయికన్న ఎక్కువే “స్పేస్” ఇస్తోంది.

అందులో ఉన్నది గుప్పెడు మందే. గత ఏడాదిన్నరగా కష్టపడుతున్నా పాపం వారి సభలో సంఖ్య రెండంకెలు కూడా దాటట్లేదు. ఎలా దాటుతుంది? చేసే పనిలో చిత్తశుద్ధి ఉండాలి కదా. విశాలాంధ్ర పేరిట వారు చేసేది అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణ ఉద్యమం మీద, ఇక్కడి ప్రజల మీద విషం చిమ్మడమే. ఈ మూకను పెంచి పోషిస్తున్నది బెజవాడ బ్రోకర్ ఉరఫ్ లగడపాటి అనే జోకర్.

వారి కడుపులో ఎంత విషం ఉందో తాజాగా పరకాల ప్రభాకర్ తెలంగాణ మార్చ్ పై చేసిన దొంగ విశ్లేషణతో మరోసారి బయటపడింది.  ఎప్పటిలాగానే ఈ చెత్త విశ్లేషణను పట్టుకుని లగడపాటి జోకర్ తెగ వాగుడు వాగుతున్నాడు. వీరిద్దరి అతి చేష్టల వల్ల సమైక్యాంధ్ర ఉద్యమానికి మేలు జరగకపోగా తెలంగాణ ప్రజల రాష్ట్రసాధన సంకల్పం రెట్టింపు అవుతుంది.

సెప్టెంబర్ 30 నాడు తెలంగాణ మార్చ్ కు లక్షలాది మంది ప్రజలు వచ్చి మరోసారి తమ ప్రత్యేక రాష్ట్ర కాంక్ష చాటారు. కానీ పరకాల బృందానికి మాత్రం ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయి. పత్రికల్లో ప్రచురితమైన మీటింగు ఫొటోనొకదాన్ని తీసుకుని కోడి గుడ్డు మీద ఈకలు పీకే పని ఒకటి మొదలుపెట్టారు. ఆ ఫొటోపై పరకాల విశ్లేషణ చూస్తే వారి మెదడు మోకాల్లో కాదు కదా అరికాల్లో కూడా లేదని చిన్నపిల్లాడికైనా అర్థం అవుతుంది.

పరకాల చేసిన పిచ్చిపని చూడండి:

తెలంగాణ మార్చ్ ఫొటోను తీసుకుని దానిపై నిలువు, అడ్డం గీతల గ్రిడ్ ఒకదాని గీసి ఒక్కో చదరంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో లెక్కకట్టి మొత్తం మార్చ్ కు 18,000 మందే వచ్చారని తేల్చాడీ మట్టి బుర్ర.

ముందీ అవకతవక మేధావి విశ్లేషణలో ఉన్న డొల్ల వాదనను చూద్దం. ఆ తరువాత తెలుగు జాతి అంతా ఒక్కటిగానే ఉండాలని పైకి కోరుకునే ఇతగాడి మనసులో తెలంగాణపై ఎంత విషం ఉన్నదో చూద్దాం.

పరకాల వాదన ఇది:



Comments

Popular Posts