kcr speech in hydrabad@telangana

kcrrrrkcrrrrkcrrrr

టీ మంత్రుల తీరును చీత్కరించిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
- టీ కాంగ్రెస్ నేతలు పదవుల్లేకుంటే చస్తారా?
- మంత్రి జానాకు ఇజ్జత్, మానం ఉండాలిkcrrrr
- చీము, నెత్తురుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, 
ఎంపీలు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలి
- నీళ్లు, ఉద్యోగాలు, నిధులు ఎత్తుకుపోతే 
దొంగలే అంటం: కేసీఆర్
- త్వరలో భారీ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి
‘పదవుల్లేకుంటే చస్తారా? తెలంగాణ ఇవ్వనంటున్న అధిష్ఠానానికి ఎంతకాలం గులాంగిరీ చేస్తారు? థూ.. ఇదా టీ కాంగ్రెసోళ్లు పొందే గౌరవం? టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రజల్లో గౌరవమెక్కడుంది? ఎంపీలు, ఎమ్మెల్యేలంటే నలుగురు దండం పెట్టేలా ఉండాలి. ఇదా గౌరవం పొందేది? తెలంగాణ కోసం పదవులకు రాజీనామా చేయమంటే ఎందుకు చేయరు?’ అని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు నిప్పులు చెరిగారు. ఆదివారం మొదలైన తెలంగాణ సమరదీక్ష సోమవారం సాయంత్రం ముగిసింది. ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరైన కేసీఆర్.. కాంగ్రెస్ అధిష్ఠానంపైనా, టీ కాంగ్రెస్ నేతలపైనా, రాజమంవూడిలో సభ పెట్టి తెలంగాణవాదంపై విషంగక్కిన ఉండవల్లి అరుణ్‌కుమార్‌పైనా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘మంత్రి జానాడ్డికి ఇజ్జత్, మానం ఉండాలి. జేఏసీ పెట్టి అందరం రాజీనామాలు చేద్దామంటే అప్పుడు పారిపోయిండు. ఇప్పుడు కూడా రాజీనామా చేయడట. కుక్కిన పేనులా కాంగ్రెస్ కుటుంబంలోనే పడి ఉంటడట’’ అని ఎద్దేవా చేసిన కేసీఆర్.. ‘చిల్లర పదవులకు ఆత్మను అమ్ముకుంటారా.. ఎందుకా పదవులు.. పైరవీలకా? చీము, నెత్తురు ఉంటే వెంటనే తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవులకు రాజీనామా చేయాలి. ఉద్యమంలోకి కలిసి రావాలి’ అని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ బొంద మీద టీఆర్‌ఎస్‌ను కలుపుతామన్నా కాంగ్రెస్ సన్నాసులు వినలేదంటూ తీవ్రంగా దుయ్యబట్టారు.

‘మూడు తరాలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు శాపంగా మారింది. తెలంగాణను నెహ్రూ ముంచిండు, ఇందిరాగాంధీ ఉద్యమకారులను చంపింది, సోనియాగాంధీ రాచి రంపాన పెడుతోంది’ అంటూ కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలుగుప్పించారు. రాజమంవూడిలో సభ పెట్టిన ఉండవల్లిపైనా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్.. ‘ఉండవల్లి దిక్కుమాలిన సభ పెట్టిండు. ఆ సభలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక్కరూ లేరే?’ అని నిలదీశారు. విశ్వాసంపైనే స్నేహం ఆధారపడి ఉంటుందని, కానీ ఆంధ్రోళ్లు జబర్దస్తీగా స్నేహం చేయమంటే ఎలాగని ప్రశ్నించారు. తుక్కు యూపీఏ తెలంగాణ ఇవ్వకుంటే ఎన్‌డీఏ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చేందుకు రెడీగాఉందంటూ ‘దటీజ్ లెవల్ ఆఫ్ తెలంగాణ’ అన్నారు. ‘తెలంగాణ ప్రకటన చేసి, వాగ్దానాన్ని నిలుపుకోకుండా, పార్లమెంట్ గౌరవాన్ని ప్రపంచ దేశాల ఎదుట ఛీ అనే స్థితికి తెచ్చుకుంటున్నారని సోనియాపై ఒకవైపు కేంద్రం తెలంగాణ ఇచ్చేది లేదని సంకేతాలు ఇస్తున్నా.. పదవులను పట్టి వేలాడుతున్న టీ కాంగ్రెస్ నేతలు, ప్రత్యేకించి మంత్రులపై టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు నిప్పులు చెరిగారు. పదవుల్లేకుంటే చస్తారా? అని నిగ్గదీశారు. ఇంకా ఎంత కాలం కాంగ్రెస్ అధిష్ఠానానికి గులాంగిరీ చేస్తారని నిలదీశారు. ‘థూ! ఇదా టీ కాంగ్రెసోళ్లు పొందే గౌరవం? టీ.మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రజల్లో గౌరవమెక్కడుంది? ఎంపీలు, ఎమ్మెల్యేలంటే నలుగురు దండం పెట్టేలా ఉండాలి. ఇదా, గౌరవం పొందేది? పదవుల్లేకుండా ఉంటే చస్తారా? నేనైతే బండకట్టుకొని బావిలో దూకేటోన్ని. తెలంగాణ కోసం పదవులకు రాజీనామా చేయమంటే ఎందుకు చేయరు?’ అని కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీని, యూపీఏ ప్రభుత్వాలను ఆయన తూర్పారబట్టారు. తెలంగాణపై కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ఒత్తిడిని కొనసాగించేందుకు టీజేఏసీ నిర్వహించిన 36గంటల సమరదీక్ష ముగింపు సందర్భంగా ఆదివారం సాయంత్రం జరిగిన సభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే... 


‘మంత్రి జానాడ్డికి ఇజ్జత్, మానం ఉండాలి. జేఏసీ పెట్టి అందరం రాజీనామాలు చేద్దామంటే అప్పుడు పారిపోయిండు. ఇప్పుడు కూడా రాజీనామా చేయడట. కుక్కిన పేనులా కాంగ్రెస్ కుటుంబంలోనే పడి ఉంటడట. తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి కలిసి రావాలి. నిన్న రాత్రి ఏం జరిగిందో చూశారు. టీ ఎంపీలు వస్తే ప్రజాక్షిగహానికి గురికావాల్సి వచ్చింది. ఎంతకాలం గులాంగిరి చేస్తారు? చిల్లర పైరవీలకా ఆ పదవులు? పార్లమెంట్ చప్రాసీకి ఉన్న దమాక్ ప్రధానికి లేదు. నన్ను చూడగానే చప్రాసీలు జైతెలంగాణ అంటరు. తెలంగాణ కోసం ఎన్ని సమ్మెలు చేయాలి? అయినా కేంద్రం నుంచి స్పందన లేదు. ప్రజాస్వామిక దేశంలో ప్రజల విశ్వాసం పొందాలి. ఇదేం దిక్కుమాలిన పరిస్థితి? తెలంగాణ ఇస్తామంటే నమ్మాలా? 1969కి ముందే తెలంగాణ బొబ్బ ప్రారంభమైంది. అప్పటి నుంచి నిరంతరంగా, రాజీ లేకుండా ఉద్యమిస్తూనే ఉన్నాం. ఇది ప్రభుత్వమా? దున్నపోతు రాజ్యమా? ప్రభుత్వం ఉద్యమాన్ని ఎందుకు గుర్తించదు? శాంతియుతంగాదీక్ష చేస్తామంటే అనుమతివ్వకుండా సాకులు చెప్పారు. ఎందుకు అనుమతివ్వరు? పన్నెండేళ్ల ఉద్యమ చరివూతలో ఎవరినైనా కొట్టినమా? తిట్టినమా? ఎవరి ఆస్తులేమైనా పగులగొట్టినమా? ఉపవాసాలుండి దీక్ష చేశాం. తెలంగాణ కోసం మాకు మేమే కాలబెట్టుకున్నం. సీఎం, డీజీపీ! పిచ్చిపిచ్చి ప్రయత్నాలు ఆపండి. మీ చేతులే కాలుతాయి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించండి. జేఏసీ ఆఫీసుకు వెళ్లకుండా పోలీసులు ఎమ్మెల్యేలను అరెస్టు చేస్తారట. పట్టుకొని ఏం పీకుతారు. చంపుతారా? పిచ్చకుంట్ల బెదిరింపులకు భయపడేది లేదు. బెదిరింపులు ఆపండి. ఉద్యమంలోకి వచ్చినపుడే ‘సర్ పే కఫన్ బాంద్‌కర్ ఆయే’, గులాబీ జిందగీసే మౌత్ ఠీక్ హై. తెలంగాణ శృంఖలాలు తెగేదాక పోరాడుతాం. తెలంగాణ కోసం కాంగ్రెస్ బొంద మీద టీఆర్‌ఎస్‌ను కలుపుతామన్నం. సన్నాసులు వినరే. మూడు తరాలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు శాపంగా మారింది. తెలంగాణను నెహ్రూ ముంచిండు, ఇందిరాగాంధీ ఉద్యమకారులను చంపింది, సోనియా రాచి రంపాన పెడుతోంది. తెలంగాణపై ఏకాభివూపాయం కావాటంటున్నరు. తెలంగాణపై ఢిల్లీ కదలికలు రాగానే సీమంధ్ర నాయకులు జట్టు కట్టి సూట్‌కేసులతో ఢిల్లీ వెళ్తరు. ఉండవల్లి దిక్కుమాలిన సభ పెట్టిండు. ఆ సభలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక్కరూ లేరే? అది పక్కా ఆంధ్ర మీటింగ్. దానికి ఆంధ్రవూపదేశ్ సమావేశమంటరు. సన్నాసులారా! తెలంగాణపై ఏకాభివూపాయం ఎక్కడ రావాలి.

ఇండియాకు స్వాతంత్రం ఇచ్చినపుడు బ్రిటన్‌లో అడిగారా? బ్రిటీష్ వాళ్లు తలవంచి దేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్లి పోయారు. తెలంగాణ కోసం ఆంధ్రలో ఏకాభివూపాయం అడగాలా? వాళ్లింటో పీనుగెల్లా! అబ్బబ్బ ఎన్ని సంప్రదింపులు? దిక్కుమాలిన కథలు. నా ప్రసంగం వస్తుందంటే టీవీ, కరెంటు బంద్ చేసిండ్రు. ఆంధ్రోళ్లది చిల్లర మనస్తత్వం. జానాడ్డి రాజీనామా చేయడట. ఇది వాళ్ల బతుకు. ఇజ్జత్, మానం ఉండాలి. తెలంగాణ ప్రకటన వెనక్కి వెళ్లిన సందర్భంగా జేఏసీ పెట్టి అందరం రాజీనామాలు చేద్దామంటే వీపు చూపి జానాడ్డి పారిపోయిండు. ఆత్మవంచనతో ఎంతకాలం బతుకుతరు? మా విద్యార్థులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు తింటుంటే మీరు పదవుల్లో కొనసాగుతారా? గులాంగిరి ఎంతకాలం చేస్తారు? చీము, నెత్తురు ఉంటే వెంటనే తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవులకు రాజీనామా చేయాలి. ఉద్యమంలోకి కలిసి రావాలి. గమ్యాన్ని ముద్దాడేదాక పోరాటాలను సాగిద్దాం. తెలంగాణవాదుల మధ్య ఐక్యత కొనసాగాలి. రానివారిని దారికి తెచ్చుకోవాలి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీ కార్యక్షికమాన్ని నిర్వహిద్దాం. లక్షలాదిగా తరలిరావాలి. కొన్ని భారీ కార్యాచరణలు ఇప్పటికే రూపొందించాం. కేంద్రం మెడలు వంచేలా త్వరలోనే పక్కా కార్యాచరణను ప్రకటిస్తాం. జేఏసీ సమావేశంలో భాగస్వామ్యపక్షాలతో కలిసి కార్యాచరణను ప్రకటిస్తాం. తెలంగాణ వచ్చేదాక ప్రయాణం సాగాలి. తెలంగాణ బాధ రాసుకుంటే రామాయణమంత ఉంటది. ఉద్యమంలో ఎన్నో గాయాలు, ఇబ్బందులు ఉన్నాయి. కేంద్రంపై ఒత్తిడిని పెంచుతుండగానే ఆంధ్రోళ్లు మోసాలు చేస్తూ తెలంగాణను అడ్డుకునేందుకు సభలు పెడుతున్నరు. రాష్ట్ర ఆదాయంలో తెలంగాణ ప్రాంతం నుంచే మూడు రెట్లు ఆదాయం వస్తోంది. నాలుగు డిపార్ట్‌మెంట్స్ ఆదాయం లెక్కిస్తే తెలంగాణ నుంచి రూ.39,900 కోట్లు అయితే, ఆంధ్ర నుంచి రూ.13,197 కోట్లు.

ఆదాయం ఇక్కడిదైతే ఖర్చు అక్కడ పెడతరు. తెలంగాణ ఆదాయాన్ని తినమరిగిండ్రు. పొమ్మంటే ఎందుకు పోతరు. మా ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారులు రామలక్ష్మణ్, ఏకే గోయల్ పక్కాగా ఈ లెక్కలు తీసిండ్రు. తప్పులుంటే ఆంధ్రోళ్లు కిరికిరి పెడతరని జాగ్రత్తలు తీసుకున్నా. వివరాలు ప్రకటించాక కుక్కిన పేనులాగా ఉండిపోయిండ్రు. ఏమైనా అంటే ఈడ్చి బండకు కొడదామనుకున్నా. కాగితాలపై తెలంగాణకు 1300 టీఎంసీల నీటి కేటాయింపులు ఉంటాయి. ఆ నీళ్లతో కోటి 30లక్షల ఎకరాలను సాగు చేసుకోవచ్చు. కనీసం 30లక్షల ఎకరాలైనా పారాలి. కేటాయింపులేమో తెలంగాణకు, దొబ్బేది ఆంధ్రోళ్లు. కండలేరు, సోమశిల ప్రాజెక్టులకు అనుమతి ఉందా? 130 టీఎంసీలను ఆపారు. దీనిపై ఉండవల్లి ఏం సమాధానం చెబుతారు? విద్యుత్‌ను ఇచ్చామంటున్నరు. ఎవరి సొమ్ము ఎవరు తింటున్నరో? వందల సంవత్సరాల కిందటే మా దగ్గర బిర్యానీ, షేర్వానీ, ఖుర్బానీ ఉంది. ఆంధ్రలో తినే ఉలువచారు మా దగ్గర ఎడ్లకు, గేదలకు వేస్తం అంటే.. మేం పశువులమా? అని ఆంధ్రోళ్లు అంటరు.విశ్వాసంపైనే స్నేహం ఆధారపడి ఉంటుంది. కాని ఆంధ్రోళ్లు జబర్దస్తీగా (బలవంతంగా) స్నేహం చేయమంటే ఎలా? రాజమండ్రి సభలో కేసీఆర్ బొమ్మ చూసి అక్కడోళ్లు తరించారు.

నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, వనరులు దోచుకున్నోళ్లను, ఎత్తుకుపోయినోళ్లను దొంగలు అంటరు. అగో మాకు దొంగలంటారా? అని ప్రశ్నిస్తున్నారు. ఎస్. ఇంకా వేయి సార్లు అంటం. దయ్యం పడితే దిగేదాక వేపాకులతో కొడతరు. తుక్కు యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకుంటే ఎన్‌డీఏ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చేందుకు రెడీగాఉంది. దటీజ్ లెవల్ ఆఫ్ తెలంగాణ. పొట్టి శ్రీరాములు మంచోడు. ఆంధ్ర రాష్ట్రం కోసం 13 రోజులు దీక్ష చేస్తే అప్పుడు నెహ్రూ రాష్ట్రాన్ని ప్రకటించారు. కానీ సీమాంధ్ర నాయకులు మద్రాస్ కావాలని పేచీ పెట్టి, ఆయనతో దీక్ష చేయించారు. తమిళనాడు సీఎం రాజాజీని బొద్దింక అని, నామాల నల్లకాకి అంటూ తిట్టారు. రాజాజీకి వ్యతిరేకంగా అనేక పద్యాలు రాశారు. ఇప్పుడు హైదరాబాద్‌పై పేచీ పెడుతున్నట్లుగానే అప్పుడు ఆంధ్రోళ్లు మద్రాస్‌పై అలాగే చేశారు. ఆంధ్ర రాష్ట్రం ఉత్తర్వులు రాగానే ఆంధ్ర కుక్కల్లారా! గెటౌట్ అని గెంటేశారు. చంబల్ కా దేవల్ చప్పల్ కే పాస్ అన్నట్లు అయింది. తెలంగాణపై ఇద్దరు కేంద్ర హోంమంవూతులు మాట తప్పారు. సోనియాగాంధీ అండ్ కంపెనీ దేశ కీర్తిని ప్రపంచ స్థాయిలో తలదించుకునే చేసింది. తెలంగాణ ప్రకటన చేసి, వాగ్దానాన్ని నిలుపుకోకుండా, పార్లమెంట్ గౌరవాన్ని ప్రపంచ దేశాల ఎదుట ఛీ అనే స్థితికి తెచ్చుకుంటున్నారు. తెలంగాణ పచ్చగా ఉండాలన్నా, ఉద్యోగాలు , నిధులు పుష్కలంగా ఉండాలన్నా, ప్రగతి పథంలో పయనించాలన్నా తెలంగాణ రాష్ట్రంలోనే సాధ్యం. అప్రతిహతంగా సమరదీక్ష చేసిన టీజేఏసీ చైర్మన్ కోదండరాం, బృందానికి, తెలంగాణవాదులకు 

Comments

Popular Posts