ktrundavalli fire
హైదరాబాద్ : ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌పై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ధ్వజమెత్తారు. ఉండవల్లి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదే లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ భాష ప్రజలకు అర్థమయ్యే భాష అని కేటీఆర్ వివరించారు. కాంగ్రెస్ నాన్చుడి ధోరణి అవలంబిస్తే పదేపదే తిడుతామని తేల్చిచెప్పారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణకు ఉంటే సీమాంధ్రుల అపోహాలు తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తెలంగాణ కావాలంటే దేశం మొత్తం ఒప్పుకోవాలని ఉండవల్లి అనడం సరికాదన్నారు. 2004లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నప్పుడు ఉండవల్లి ఏం చేశారని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో 42 పార్టీలకు గానూ 36 పార్టీలు తెలంగాణకు మద్ధతు ఇచ్చాయని, దీనిపై ఉండవల్లి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఉండవల్లికి రాజ్యాంగం తెలియదన్నారు.
Comments
Post a Comment