garam garam telangana


28లోగా తేల్చకపోతే అంధకారం
- తెలంగాణ ప్రకటన చేయకపోతే యుద్ధమే
- కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తాం
- ఆజాద్ వాఖ్యలకు నిరసనగా హోరెత్తిన విద్యుత్‌సౌధ 

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 24 (టీ మీడియా): ఇచ్చిన గడువులోగా తెలంగాణ విషయం తేల్చకపోతే అంధకారం సృష్టిస్తామని తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు హెచ్చరించారు. 28లోగా తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యల్ని నిరసిస్తూ గురువారం విద్యుత్‌సౌధ ఎదుట తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నిరసన కార్యక్షికమంలో పాల్గొన్న తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి ఆజాద్ తెలంగాణ ఆశలపై నీళ్లు చల్లి కోట్లాది మంది గుండెలను గాయపర్చారని.. తెలంగాణ తల్లిని అవమానపర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మనకు యుద్ధమే మిగిలిందని అన్నారు.

సకల సమ్మెను మించిన పోరాటానికి సన్న ద్ధం కావాలని పిలుపునిచ్చారు. వెయ్యి జాక్ లు ఏకమై.. కాంగ్రెస్ నేతలే టార్గెట్‌గా ఉద్యమించాలన్నారు. టీపీఎఫ్ ఉపాధ్యక్షుడు వేదకుమా ర్ మాట్లాడుతూ మానసికంగా రాష్ట్రం విడిపోయిందని.. ఇక సమైక్యంగా ఉండడం సాధ్యం కాదన్నారు. ఆజాద్ మాటల వెనుక సీమాంవూధుల డబ్బు సంచులు ఉన్నాయని ఆరోపించా రు. టీపీఎఫ్ కార్యదర్శి చిక్కుడు ప్రభాకర్ మాట్లాడుతూ ఆజా ద్ సీమాంధ్ర డబ్బులకు అమ్ముడు పోయారని ఆరోపించారు. టీఈఈఏ అధ్యక్షుడు శివాజీ మాట్లాడుతూ అబద్ధాలు చెప్ప డం సీమాంవూధులకు వెన్నతో పెట్టిన విద్య అని.. పరకాల ప్రభాకర్‌కు ధైర్యం ఉంటే విద్యుత్‌సౌధకు వస్తే తెలంగాణ ఉద్యోగుల వాటా ఉంతో చూపిస్తామని అన్నారు.

సీపీడీసీఎల్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ జానయ్య మాట్లాడు తూ 60 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణను మోసం చేస్తూనే ఉన్నదని, ఆ పార్టీని నమ్మడానికి వీలులేదని అన్నారు. మర్యాదగా ఇస్తే సరేనని.. లేకపోతే దంచి తీసుకుంటామని హెచ్చరించారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో జరిగిన నిరసన కార్యక్షికమంతో విద్యుత్‌సౌధ దద్దరిల్లింది. ధర్నాలో టీఈఈఏ ప్రధాన కార్యదర్శి స్వామిడ్డి, కో శాధికారి సురేందర్‌డ్డి, కార్యదర్శి మధుసూధన్‌డ్డి, రాము లు, నర్సింహారావు, విద్యుత్ ఉద్యోగులు శ్యాంమనోహర్, సుశీల్‌కుమార్, భద్ర య్య, రవి, చంద్రయ్య, శ్రీకాంత్, రాజేశ్వర్‌రావు, నర్సిడ్డి, లింగమూర్తి, బాల్‌నారాయణ పాల్గొన్నారు.
;

Comments

Popular Posts